![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -879 లో.... జగతికి బల్లెట్ తగలగానే రిషీ, వసుధార అందరు కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆ సిచువేషన్ లో జగతిని చూసిన మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మహేంద్ర తనలోని బాధని రిషికి చెప్తాడు. జగతి ఎప్పుడు నీకోసం ఆలోచిస్తుంది. తన ప్రాణాలను లెక్కచెయ్యకుండా నీ విషయంలో ఎంతో తెగువ చూపించిందని రిషికి మహేంద్ర చెప్తాడు.
ఆ తర్వాత రిషి ఇప్పటికి అయిన తనని అర్థం చేసుకోమని మహేంద్ర అంటాడు. తను మీ అమ్మ.. నిన్ను కన్న తల్లి.. ఈ క్షణం వరకు నీ క్షేమం గురించి ఆలోచించింది. ఎంత సేపు నా కొడుకు నా కొడుకు అంటూ.. కొడుకుతో అమ్మ అని పిలిపించుకోని దూరద్రుష్టవంతురాలు అని మహేంద్ర చెప్తూ ఎమోషనల్ అవుతాడు. వసుధార కూడా మేడమ్ ని దూరం పెట్టిందని చాలా బాధపడింది. తను ఎం చేసిన మీ కోసమే తన ప్రపంచమే మీరు అని అంటూ వసుధారతో మహేంద్ర తన ఆవేదనని బయటపెడతాడు. ఆ తర్వాత హాస్పిటల్ కి చక్రపాణి వస్తాడు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి.. సిచువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది ముప్పై ఆరు గంటలు అయితే గాని ఏం చెప్పలేనని డాక్టర్ అనగానే.. రిషి డాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి దేవుని దగ్గరకు వెళ్లి జగతి గురించి మొక్కుకుంటాడు. అక్కడ మహేంద్ర అన్న మాటలనే రిషి గుర్తు చేసుకుంటాడు. అప్పుడే రిషి దగ్గరికి వసుధార వస్తుంది. గతంలో నేను మేడమ్ విషయంలో తప్పు చేశాను. ఒక తల్లిని అనకూడని మాటలు అన్నానని రిషి బాధపడుతాడు. కేవలం నావైపు నుండి అలోచించి బాధపెట్టాను. నా చుట్టు ఏం జరుగుతుంది. మేడమ్ కి నాకు ఈ ఏడబాటు ఏంటి నా ప్రాణాల కోసం మేడమ్ ప్రాణాలు అడ్డుపెట్టారు. మా అమ్మ కోలుకోవాలని వసుధారతో రిషి అనగానే.. వసుధార ఎమోషనల్ గా చూస్తుంది. నాకు చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ తెలియదు. ఆ తల్లి ప్రేమ పొందాలని అనుకుంటున్నాను. నా తల్లికి ఏం కాదు కదా అని రిషి అంటాడు. మీరు పిలిచిన ఈ పదం గురించి అయిన మేడమ్ బాగుంటారని రిషికి వసుధార దైర్యం చెప్తుంది.
మరొకవైపు జగతి గురించి మహేంద్ర బాధపడుతుంటాడు. నా ప్రాణాలు తియ్యాలని అనుకున్న వాళ్ళు ఎవరని వసుధారని రిషి అడుగుతాడు. వసుధార చెప్పబోతుండగా అక్కడికి ఫణింద్ర, శైలేంద్ర, ధరణి, దేవయాని వస్తారు. అసలు ఇలా ఎలా జరిగిందంటూ ఫణింద్ర అడుగుతాడు. ఇదంతా చేసింది మా అయన అని ఎలా చెప్పాలని ధరణి తన మనసులో అనుకుంటుంది. మరొక వైపు వసుధార దగ్గరికి శైలేంద్ర వచ్చి.. రిషి ఉండాల్సిన ప్లేస్ లో జగతి మేడమ్ ఉన్నారంటూ వసుధారకి కోపం వచ్చేలా శైలేంద్ర మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |